యువరత్న టీజర్… సోషల్ మీడియాలో హల్చల్…

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా యువరత్న. కేజీఎఫ్ సినిమాని నిర్మించిన ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తుండడంతో యువరత్న సినిమాపై కన్నడ సినీ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. సయేశా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సంతోష్ డైరెక్ట్ చేస్తున్నాడు. పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న ఈ మూవీ టీజర్ దసరా కానుకగా రిలీజ్ అయ్యింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ టీజర్ పవర్ ప్యాక్డ్ గా ఉంది. పునీత్ లుక్ చాలా యుంగ్ గా ఉంది, ఫస్ట్ నుంచి మంచి ఫిజిక్ మైంటైన్ చేస్తున్న పవర్ స్టార్ యువరత్న సినిమాలో కూడా చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్ పర్సన్ ని కావాల్సిన ఫిట్నెస్ మైంటైన్ చేయడం చాలా కష్టం. ఆ లుక్ ని తీసుకు రావడానికి పునీత్ ఎంత డేడికేటెడ్ కష్టపడ్డాడో అర్ధమవుతుంది. మొత్తానికి దసరాకి పునీత్ రాజ్ కుమార్ అతని అభిమానులకి పవర్ ఫుల్ టీజర్ ఇచ్చాడు.