మ్యూజిక్ వీడియో ఈ రేంజులో ఉందేంటి?

కొన్ని సార్లు ఒక చిన్న వీడియో క్లిప్ చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. పర్ఫెక్ట్ గా కంపోజ్ చేసిన ఒక సాంగ్ ఇచ్చిన ఇంపాక్ట్ కొన్నిసార్లు ఫుల్ సినిమా కూడా ఇవ్వలేదు. అలాంటి ఒక సాంగ్ పొవాట్టుమ్ పోగాట్టుమ్. ఖైదీ ఫేమ్ అర్జున్ దాస్, డింపుల్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కలిసి నటించిన ఈ ప్రైవేట్ సాంగ్ టీజర్ ని రిలీజ్ చేశారు. 2028లో మొదలైన శివ ఐషా ప్రేమ కథ 2050 వరకూ ఎలా వెళ్లింది? వారి కథలో ఏం జరిగింది అనేదే పొవాట్టుమ్ పోగాట్టుమ్ సాంగ్ కంటెంట్. ఈ టీజర్ లో చూపించిన విజువల్స్ చూడడానికి చాలా గ్రాండ్ గా, మ్యూజిక్ వినడానికి చాలా షూటింగ్ గా ఉంది. మద్రాస్ లోగి విగ్నేష్ రాసి డైరెక్ట్ చేసిన ఈ సాంగ్ మే 20న సాయంత్రం 5గంటలకి రిలీజ్ కానుంది.