కామన్ డీపీ అదిరింది కానీ అప్డేట్ లేనట్లే…

ఇస్మార్ట్ రామ్ పోతినేని… దేవదాసు సినిమాతో 18 ఏళ్లకే అరంగేట్రం చేసిన ఈ హీరో, తన ఎనర్జీతో స్పెషల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. తెరపై రామ్ పోతినేని కనిపిస్తే కరెంట్ పాస్ అయినట్లు ఉంటుంది, అంతటి ఎలెక్ట్రిఫయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే రామ్ పోతినేని పుట్టినరోజు ఈరోజు. ఫ్యాన్స్ ఈ సందర్భంగా విడుదల చేసిన కామన్ డీపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ పోతినేని ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లుక్స్ ని మిక్స్ చేసి చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది కానీ అభిమానులు మాత్రం నిరాశలో ఉన్నారు.

HBD Ram Pothineni: CDP viral on social media

ఇప్పటివరకు 18 చిత్రాల్లో నటించిన రామ్, ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్.6 గా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఈ మూవీ అనౌన్స్ అయ్యింది.. ఇస్మార్ట్ హీరో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. స్టైలిష్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ గా లింగుస్వామి మార్క్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈరోజు రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అప్డేట్ వస్తుందని అంతా అనుకున్నారు కానీ చిత్ర యూనిట్ హ్యాండ్ ఇచ్చి అభిమానులని నిరాశ పరిచింది. కరోనా ఆపత్తు సమయంలో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ చిత్ర యూనిట్ వెనక్కి తగ్గారు. మరి ఈ ఇస్మార్ట్ హీరో లేటెస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడో చూడాలి.