రాశి ఖన్నా చేస్తున్న సాయం ఎంతో గొప్పది…

కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో విలయతాండవం చేస్తున్న సమయంలో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు అందరూ ప్రజలను అప్రమత్తం చేస్తూ, వారి దృష్టికి వచ్చిన సమస్యలు తీరుస్తూ తోచినంత సాయం చేస్తున్నారు. సాయంలో చిన్నా పెద్ద అనే తేడా ఏమీ ఉండదు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే గొప్ప విషయం. ఈ జాబితాలోకి యంగ్ యాక్ట్రస్ రాశి ఖన్నా కూడా చేరింది.

లాక్ డౌన్ సమయంలో అనేక మంది అనాధలు, భిక్షగాళ్ల ఆకలి తీర్చే బాధ్యత రాశి ఖన్నా తీసుకుంది. ముంబై రోడ్లపై ఆకలితో అలమటించే జనాలు ఎందరో ఉన్నారు వారికి తిండి పెడుతూ రాశి కన్నా మేలు చేస్తుంది. ఈ పని కోసం ఒక ఆర్గనైజేషన్ తో చేతులు కలిపిన రాశి, ఈ అన్నదానం కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా రాశి ఖన్నా తన పని తాను చేసుకుంటూ పోతుంది.