వైరల్‌గా మారిన ‘ఎంజీఆర్’ లుక్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ కనిపించనుండగా.. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్ కోసం ఇటీవలే కంగనా రనౌత్ హైదరాబాద్ వచ్చింది. ఈ షూటింగ్ సందర్భంగా జయలలిత లుక్‌లో కంగనా ఉన్న ఫొటోలను సినిమా యూనిట్ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి.

aravind swamy mgr

తాజాగా ఈ సినిమా యూనిట్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తుండగా.. ఇవాళ ఎంజీఆర్ వర్ధంతి సందర్భంగా ఎంజీఆర్ లుక్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్‌లో అరవింద స్వామి సూపర్బ్‌గా ఉన్నాడు. స్టేజ్‌పై వైట్ డ్రెస్‌లో ఉన్న అరవింద్ స్వామి.. ప్రజలకు విక్టరీ సింబల్ చూపిస్తున్నట్లు ఈ ఫొటోలో ఉంది.

ఈ లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జయలలిత రాజకీయాల్లోకి రావడానికి ఎంజీఆర్ ఎంతో ఉపయోగపడ్డారు. దీంతో ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర అత్యంత కీలకమైనది. ఇక కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్ నటిస్తున్నాడు. ఎ.ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. విష్ణు చందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు.