ప్రభాస్ కోసం మొదటిసారి ఏఆర్.రెహమాన్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో రాబోతున్న ఆ సినిమా గురించి ప్రభాస్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ విషయంలో ఇప్పటికే ఒక ప్లాన్ రెడీ చేసుకున్న యూవీ క్రియేషన్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంత వరకు చెప్పలేదు.

అయితే ప్రభాస్ మాత్రం ఎక్కువగా ఏఆర్.రెహమాన్ పై దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. సాహో సినిమాకు చేసినట్టుగా పాటకో సంగీత దర్శకుడిని పెట్టకుండా మొత్తం ఒకే మ్యూజిక్ డైరెక్టర్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నారట. ఈ విషయంలో ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. అయితే ప్రభాస్ మాత్రం రెహమాన్ పేరును చిత్ర యూనిట్ కి సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేవారకు వెయిట్ చేయాల్సిందే.