కుర్ర హీరోలతో యూవీ క్రియేషన్స్ మల్టీస్టారర్

యూవీ క్రియేషన్స్ రెబల్ స్టార్ ప్రభాస్ తోనే కాకుండా చిన్న హీరోలతో కూడా సినిమాలను నిర్మిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. ఓ వైపు ప్రభాస్ తో రాధేశ్యామ్ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాను నిర్మిస్తునే మరోవైపు యువ హీరోలతో కూడా మీడియం బడ్జెట్ లో సినిమాలను సెట్ చేసుకుంటోంది. ఇక నెక్స్ట్ ఈ బ్యానర్ లో ఒక చిన్నపాటి మల్టీస్టారర్ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.


ఆ మల్టీస్టారర్ కథలో నటించబోయే హీరోలు మరెవరో కాదు. ఒకరు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కాగా.. మరొకరు డైరెక్టర్ శోభన్ తనయుడు సంతోష్. ఈ ఇద్దరు ఇదివరకే ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించారు. ఇక ఇప్పుడు యూవీ క్రియేషన్స్ సెట్ చేసుకున్న ఒక అడల్ట్ కామెడీ కథలో ఇద్దరు కూడా మెయిన్ లీడ్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఆ సినిమా షూటింగ్ ని కరోనా తీవ్రత తగ్గిన తరువాత స్టార్ట్ చేసే అవకాశం ఉంది.