Anushka: థ్యాంక్యూ బ్రో భ‌ళ్లాల‌దేవ.. అనుష్క షాకింగ్ కామెంట్‌‌!

Anushka: భ‌ళ్లాల‌దేవ రానా న‌టించిన ఆర‌ణ్య చిత్రం మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఈ సినిమా దూసుకెళ్తుంది. కాగా ఈ చిత్రం ఏనుగుల నేప‌థ్యంలో తెర‌కెక్క‌డంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌కు ఏనుగు బొమ్మ‌ల‌తో కూడిన గూడీస్ గిఫ్ట్‌గా పంపాడు రానా. ఆ గూడీస్‌ను ప్ర‌ముఖ హీరోయిన్ అనుష్క‌కు పంపాడు రానా. దీనికి సంతోషించిన స్వీటీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో..

Aranya Movie

థ్యాంక్యూ రానా బ్రో..నాకు ఇవి బాగా న‌చ్చాయి.. ఆర‌ణ్య టీమ్‌కు నా శుభాకాంక్ష‌లు అని పోస్ట్ చేసింది. Anushka అనుష్క పెట్టిన ఆ పోస్ట్‌లో రానా పంపిన గూడీస్ ప‌క్క‌న త‌న పెట్ డాగ్‌ను నిల‌బెట్టి ఫోటో తీసి షేర్ చేయ‌డం విశేషం. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇదిలా ఉంచితే రానా, అనుష్క రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లి చిత్రాల్లో న‌టించి వీరి జోడీ మంచి గుర్తింపు సంపాదించుకుంది.