Mega Powerstar: రాంచ‌ర‌ణ్ రాముడు అంటూ మెగా బ్ర‌ద‌ర్ బ‌ర్త్‌డే విషెస్‌..

Mega Powerstar: మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ నేడు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు టాలీవుడ్ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఒక్క‌రోజు ముందు నుంచే రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సెలెబ్రెష‌న్స్ మొద‌ల‌య్యాయి. నిన్న హైద‌రాబాద్‌లోని శిల్పాక‌ళా వేదిక‌లో చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.. ఫ్యాన్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇక తాజాగా రాంచ‌ర‌ణ్ బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.

Ramchran

ఈ మేర‌కు నాగ‌బాబు రాంచ‌ర‌ణ్‌కు ప్ర‌త్యేకమైన విషెస్ తెలుపుతూ.. రాముడు దేవుడు మాత్ర‌మే కాదు.. అన్న‌ద‌మ్ముల ప్రేమ‌కు ప్ర‌తిరూపం.. మా జ‌న‌రేష‌న్‌లో అన్న‌య్య చిరంజీవి రాముడిలా ఉన్నారు. ఈ జ‌న‌రేష‌న్‌లో అన్న‌ద‌మ్ముల‌కు అండ‌గా ఉంటూ నువ్వు రాముడివ‌య్యావు అంటూ రాంచ‌ర‌ణ్ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు నాగ‌బాబు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతారామ‌రాజు, ఆచార్య చిత్రంలోని సిద్ధ పాత్ర పోస్ట‌ర్ల‌లో రాంచ‌ర‌ణ్ అభిమానుల‌ను ఎంతో ఫిదా చేశాయి.‌