BB3లో మరో హీరోయిన్

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న బీబీ3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యాజైస్వాల్, పూర్ణలు నటిస్తుండగా.. తాజాగా సినిమాలో మూడో హీరోయిన్ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఐటెం సాంగ్ కోసం ఒక హీరోయిన్‌ను ఎంపిక చేశారట. ఈ ఐటెం సాంగ్‌లో నటించేందుకు ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట.

ANOTHER HEROINE IN BB3

భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు ఒకే చెప్పడంతో.. ఐటెం సాంగ్‌లో నటించేందుకు హాట్ హీరోయిన్ ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశముంది. అయితే ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి అనేక పేర్లు వినిపిస్తున్నాయి. మోనార్క్ అనే టైటిల్ మొన్నటివరకు వినిపించగా.. తాజాగా డ్రామా అనే టైటిల్ వినిపిస్తోంది.