Ramcharan: శంక‌ర్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డంపై రామ్‌చ‌ర‌ణ్ స్పంద‌న..

Ramcharan: మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం వంటి సినిమాలతో చెర్రీ గుర్తింపు ఆమాంతం పెరిగిపోయింది. తాజాగా ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ డైరెక్ష‌న్‌లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా ఓ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో Ramcharan రామ్‌చ‌ర‌ణ్ స్పందిస్తూ.. త‌మిళ ద‌ర్శ‌కుడు శంక‌ర్ స‌ర్ వంటి మేధావి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న చిత్రంలో తాను కూడా భాగం కావ‌డం ఎంతో ఉద్విగ్న‌త‌కు గుర‌య్యాయ‌ని అన్నారు.

cherry-shanker

తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు Ramcharan రాంచ‌ర‌ణ్‌. త‌న కెరీర్‌లో ఇది 15వ చిత్ర‌మ‌ని, దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌కు ఇది 50వ చిత్ర‌మ‌ని చ‌ర‌ణ్ పేర్కొన్నాడు. దిల్‌రాజు, శిరీష్ ల నిర్మాణంలో వ‌స్తున్న ఈ చిత్రంలో న‌టించేందుకు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాన‌ని తెలిపాడు. ఇకRamcharan రాంచ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో బిజీగా ఉన్నాడు. అలాగే ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప్ర‌స్తుతం ఇండియ‌న్‌-2 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాల త‌ర్వాత వీరిద్ద‌రి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంద‌ని స‌మాచారం.‌