రామ్ చరణ్ కు తాతయ్య గా అమితాబ్ బచ్చన్ ?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చంగెర్ సినిమాతో కాస్త బిజీ గ ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా దర్శకుడు శంకర్ ఈ సినిమా నుండి ఓ పాటని కూడా విడుదల చేసారు. అయితే రామ్ చరణ్ తరువాయి సినిమా ఒకటి బుచ్చి బాబు సనా దర్శకత్వంలో చేయనున్నారు. దీనికి సంబందించిన కన్ఫర్మేషన్ కూడా దాదాపు వచ్చేసింది.
అయితే ఈ సినిమా నుండి ఇప్పటికి అయితే ఎక్కువ ఉపాదాట్లు రావడం లేదు అని అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతుండగా ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. బాలీవుడ్ బి బి అయినా అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బుచ్చి బాబు సినిమాలో రామ్ చరణ్ తో కలిసి అమితాబ్ బచ్చన్ స్క్రీన్ పంచుకోబోతున్నారనే కాకుండా, అమితాబ్ బచ్చన్ రామ్ చరణ్ కి తాతయ్య గా నటించాబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాత మనవడు మధ్య అనుబంధం ఎలా ఉండబోతుందో అనే విష్యం ఫ్యాన్స్ ఇప్పటికే కుతూహలంగా వేచి చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జనఃవి కపూర్ అని కంఫర్మ్ అయినట్లు అలాగే అనిమల్ సినిమా లో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది.