అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నుండి ఈరోజు కొత్త అప్డేట్

పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ పుష్ప 2 తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే మేకర్స్ నుండి మంచి అప్డేట్ రానుంది. ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు ఈ అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుండి పుష్ప మాస్ జాతర మొదలవుతుంది అని మేకర్స్ అంటున్నారు. కాగా త్వరలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండటంతో ఫ్యాన్స్ కోసం ఏదైనా సాంగ్ కానీ, లేదంటే ఏదైనా వీడియో కానీ విడుదల చేస్తారు అనుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ఆ అప్డేట్ ఎంతో తెలుసుకోవాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.