రాములో రాముల డిలే అయ్యింది కానీ డౌట్ అవసరం లేదు…

అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలో నుంచి మొదటి సాంగ్, సామజవరగమనా రిలీజ్ అయ్యి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి సిడ్ శ్రీరాం పాటకి ప్రాణం పోశాడు. యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 40 మిలియన్ వ్యూస్ తో పాటు 7 లక్షల లైక్స్‌ని సాంగ్ సొంతం చేసుకుంది. తెలుగులో మోస్ట్ లైక్డ్ సాంగ్ గా కొత్త రికార్డు సృష్టించిన సామజవరగమనా పాట మాయ నుంచి బయటకి వచ్చే లోపు చిత్ర యూనిట్ మరో సాంగ్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. ఊర మాస్ డప్పు సాంగ్ కొట్టడంలో దిట్ట అయిన థమన్, ఈసారి అల్లు అర్జున్ కోసం రాములో రాముల అంటూ సాగే దుమ్ములేపే బీట్ సాంగ్ ఇచ్చాడు. బన్నీ మార్క్ డాన్స్ ఈ సాంగ్ లో ఫుల్ రేంజులో ఎంజయ్ చెయ్యొచ్చు. మెగా ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపనున్న ఈ పాటని అక్టోబర్ 22 సాయంత్రం 4 గంటల 5నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. నిజనికి ఈ సాంగ్ ని ఈరోజే విడుదల చేయాల్సి ఉన్నా కూడా టెక్నకల్ ఇష్యూస్ వల్ల రాములో రాముల సాంగ్ బయటకి రావడానికి డిలే అయ్యింది. ఎంత డిలే అయిన రాములో రాముల సాంగ్ మెగా అభిమానులకి కొత్త జోష్ ఇవ్వడం ఖాయం.

ramuloo ramula

ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ లో కూడా జాయిన్ అయిన సుశాంత్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇతని అందమైన చిరునవ్వుకి ఎవ్వరైనా పడిపోతారు అంటూ ఓ క్యాప్షన్ సైతం పెట్టి మేకర్స్ సుశాంత్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. చి లా సౌ సినిమాకి, అల వైకుంఠపురములో సినిమాకి సుశాంత్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. సుశాంత్ క్యారెక్టర్ ఈ సినిమాలో స్పెషల్ గా ఉండనుందని సమాచారం. ఇతనికి జోడీగా నివేద పేతురేజ్ నటిస్తోంది. అల.. వైకుంఠపురములో సినిమా జనవరి 12న సంక్రాంతి సినిమాగా థియేటర్లకు వస్తోంది.