ఓటీటీలో అల్లరి నరేష్ ‘నాంది’ రిలీజ్

అల్లరి నరేష్ హీరోగా ఇటీవల వచ్చిన బంగారు బుల్లోడు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో త్వరలో విడుదల కానున్న నాంది సినిమాపై అల్లరి నరేష్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అల్లరి నరేష్‌కి గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేదు. దీంతో మళ్లీ హిట్‌ను అందుకుని సక్సెస్ ట్రాక్ ఎక్కేందుకు అల్లరి నరేష్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన నాంది సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది.

NANDI OTT RELEASE

సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించాయి. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కూర్చోని ఉన్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాంది మూవీ శాటిలైట్ రైట్స్‌తో పాటు డిజిటల్ రైట్స్‌ను జీ స్టూడియోస్ సొంతం చేసుకుంది. రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.