రెమ్యూనరేషన్ పెంచేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఇటీవల క్రాక్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. 50 శాతం ఆక్యుపెన్సీ సమయంలో కూడా భారీ వసూళ్లు సాధించింది. క్రాక్ హిట్‌తో ఫుల్ ఖుషీలో ఉన్న రవితేజ.. తన తర్వాతి సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఖిలాడీ అనే సినిమాలో రవితేజ ప్రస్తుతం నటిస్తున్నాడు.

RAVITEJA INCREASE REMUNARATION

ఈ సినిమాకు గాను రవితేజ రూ.13 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఖిలాడీ తర్వాత త్రినాధరావు నక్కినతో చేయనున్న సినిమాకు రవితేజ రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. క్రాక్ హిట్ తర్వాత రవితేజ తన రెమ్యూనరేషన్ ఒక్కసారి పెంచేశాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.