‘బంగారు బుల్లోడు’ వివాదంపై స్పందించిన అల్లరి నరేశ్

అల్లరి నరేశ్ హీరోగా గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బంగారు బుల్లోడు. ఈ సినిమా ఇవాళ ధియేటర్లలో విడుదల అవ్వగా.. స్వర్ణ కార్మికులను కించపరిచే విధంగా ఈ సినిమా ఉందని స్వర్ణకార సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసేందుకు స్వర్ణకార సంఘాలు రెడీ అయ్యాయి. దీంతో సినిమా విడుదల ఆగిపోతుందనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది.

allari naresh bangaru bullodu

ఈ క్రమంలో వివాదంపై హీరో అల్లరి నరేష్ స్పందించాడు. స్వర్ణ కార్మికులను కించపరిచే విధంగా తమ సినిమా ఉండదని తెలిపారు. సినిమా బాగా నచ్చిందని, అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుందన్నారు. థియేటర్స్‌లో చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నానని అల్లరి నరేష్ తెలిపారు.