Sampurneshbabu: బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేశ్ బాబుకి తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..

Sampurneshbabu: సంపూర్ణేశ్‌బాబు హృద‌య కాలేయం సినిమాతో తెలుగు తెర‌పై బ‌ర్నింగ్‌స్టార్‌గా పరిచ‌యం అయ్యాడు. ఈ ఒక్క సినిమాతోనే తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్నారు. అంతేగాక ప్రేక్ష‌కుల‌ను తన వైపు తిప్పుకున్నాడు. దీంతో సంపూకి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో క్రేజ్ ఏర్ప‌డింది. ఇక ఆయ‌న చేసిన చిత్రాలు.. బందిపోటు, పెస‌ర‌ట్టు చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల్లో ముందుకు వ‌చ్చాడు.. కానీ ఈ చిత్రాలు ఆయ‌న‌కు బ్రేక్ ఇవ్వ‌లేదు.

sampurneshbabu

Sampurneshbabu సంపూ న‌టించిన చివ‌రి చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట.. ఈ చిత్రంలో ఎంతో క‌ష్ట‌ప‌డి కేవ‌లం 3నిమిషాల్లోనే సింగిల్ టేక్‌లో భారీ డైలాగ్ చెప్పి వ‌ర‌ల్డ్ రికార్డు కొట్టారు. కానీ ఈ సినిమా కూడా ఆశినంత స్థాయిలో విజ‌యం ద‌క్క‌కున్నా.. సంపూకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక Sampurneshbabu సంపూ న‌టిస్తున్న తాజా చిత్రం బజార్ రౌడి.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో సంపూకు స్వ‌ల్ప ప్ర‌మాదం జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో షూటింగ్‌కు కొంత విరామం తీసుకుని.. తిరిగి లొకేష‌న్‌లో అడుగు పెట్టి Sampurneshbabu త‌న న‌ట‌న‌తో విజృంభిస్తున్నాడ‌ని చిత్ర‌బృందం పేర్కొంది. అలాగే షూటింగ్ లొకేష‌న్‌లో ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చిత్ర‌బృందం తెలిపింది.