ఫ్యాన్స్‌కు కిక్కేంచిన‌ అఖిల్ న్యూ మూవీ పోస్ట‌ర్!

అక్కినేని యువ హీరో అఖిల్ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఫస్ట్ సినిమా నుండి ఒక్క స‌రైన హిట్టును త‌న ఖాతాలో వేసుకోలేక‌పోయాడు. ఇప్ప‌టికే చేసిన మూడు సినిమాలు అక్కినేని అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచారు. కానీ ఎన్ని ఫ్లాప్ సినిమాలు ప‌డినా ఈ యువ హీరోకి అభిమానుల ఫాలోయింగ్ మాత్రం త‌గ్గ‌లేదు. సిసింద్రీ సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన బుడ‌త‌డు అఖిల్ అక్కినేని అఖిల్ సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ వీ.వీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నితిన్ నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ అనుకున్నంత విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

akhil new movie poster

ఆ త‌ర్వాత హ‌లో, మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలు చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమాల త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న నాల్గొవ సినిమా చేస్తున్నాడు. అయితే.. అఖిల్, భాస్క‌ర్ కాంబోలో సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం గ‌తేడాదిలోనే విడుద‌ల కావాల్సింది కానీ క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోయి వాయిదా ప‌డింది. తాజాగా ఈ సినిమా నుండి సంక్రాంతి సంద‌ర్భంగా అఖిల్‌, పూజాహెగ్దే ఉన్న కొత్త‌ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు చిత్ర‌బృందం. దీంతో గ‌తంలో నాగ‌చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన 100%ల‌వ్ చిత్రం, అలాగే గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన గీత గోవిందం చిత్రాలు ఎంతో ఘ‌న విజ‌యం సాధించాయో చెప్ప‌న‌క్క‌ర్లేదు. అఖిల్ ప్ర‌స్తుత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంలో పోస్ట‌ర్‌ను చూడ‌గ్గానే 100%ల‌వ్‌, గీతాగోవిందం సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఎంతో విజ‌యం సాధిస్తుంద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.‌