ర‌వితేజ ఇర‌గ‌దీశాడు.. క్రాక్ చిత్రంపై రాంచ‌ర‌ణ్ ప్ర‌శంస‌!

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ న‌టించిన క్రాక్ చిత్రంపై మెగా ప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశానని చ‌ర‌ణ్ అన్నాడు. ర‌వితేజ న‌ట‌న టాప్ లెవ‌ల్‌లో ఉంద‌ని, అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌నబ‌ర‌చార‌ని ప్ర‌శంసించాడు చెర్రీ. ప్ర‌ముఖ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ త‌మ న‌ట‌న‌తో అద‌ర‌గొట్టార‌ని చెప్పాడు. అదేవిధంగా ఈ చిత్రానికి త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతంతో ఈ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లింద‌ని..

raviteja

డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారంటూ.. చిత్ర‌బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు. దీంతో ఈ చిత్ర డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని స్పందించ‌గా.. మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్‌కు ధ‌న్య‌వాదాలు అని తెలిపాడు. అలాగే సంక్రాంతికి ప్రేక్ష‌కుల‌కు మంచి గిఫ్ట్ ఇచ్చామ‌ని ఇందుకు గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఇటీవ‌లే మెగా హీరోలు వ‌రుణ్‌తేజ్‌, సాయితేజ్ కూడా ర‌వితేజ‌కు ఆల్ ది బెస్ట్ తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం క్రాక్‌. ఈ సినిమాలో ర‌వితేజ భార్య‌గా శ్రుతిహాస‌న్ సంద‌డి చేశారు. బి. మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మించ‌గా.. ఎస్‌.ఎస్‌. థ‌మ‌న్ సంగీతం స‌మకూర్చారు.