తెలుగు ప్ర‌జ‌ల‌కు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ సంక్రాంతి శుభాకాంక్ష‌లు..

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా సినీ ప్ర‌ముఖులు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలుపుతూ.. భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అంద‌రి ఇంట క‌ల‌ల పంట పండించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. మీకు, మీ కుటుంబ‌స‌భ్యుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు.. అంద‌రూ బాధ్య‌త‌గా, క్షేమంగా ఉండాలని సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు పేర్కొన్నారు.

sankranthi

అదేవిధంగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు అని ట్వీట్ చేశాడు. అదేవిధంగా విక్ట‌రీ వెంక‌టేశ్.. మీకు, మీ కుటుంబ‌స‌భ్యుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు అని.. అంద‌రినీ దేవుడు చ‌ల్ల‌గా చూడాలి అంటూ ట్వీట్ చేశారు. భోగ భాగ్యాల‌నిచ్చే భోగి, స‌ర‌దానిచ్చే సంక్రాంతి, క‌మ్మ‌ని క‌నుమ‌, కొత్త ఏడాది కొత్త వెలుగులు నింపాల‌ని కోరుకుంటూ ప్ర‌జ‌లంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్ష‌లు అని లేడీటైగ‌ర్ విజ‌య‌శాంతి ట్వీట్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లంద‌రికీ, అభిమానుల‌కు సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు కింగ్ నాగార్జున‌.