నేడు మెగా హీరో వైష్ణ‌వ్‌ బ‌ర్త్‌డే.. ప్రేమ‌తో నిహారిక విషేస్‌!

vishnavtej

మెగా డాట‌ర్ నిహారిక గ‌త నెల‌లో జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌నతో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. రాజ‌స్థాన్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో డిసెంబ‌ర్ 9న నిహారిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కాగా నిహారిక త‌న మేన‌బావ సాయితేజ్ సోద‌రుడు పంజా వైష్ణ‌వ్ తేజ్ బుధ‌వారం జ‌న‌వ‌రి 13న‌ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు సంద‌ర్భంగా ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేసింది. హ్యాపీ బ‌ర్త్‌డే బంగారు!! నువ్వంటే నాకేంత ఇష్ట‌మో నీకు తెలుసు.. నువ్వు సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా రాణించాల‌ని ఆశిస్తున్న‌. ఆల్ ది వెరీ బెస్ట్ వైష‌గా.. అంటూ వైష్ణ‌వ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపింది. అలాగే వైష్ణ‌వ్‌కు బ‌ర్త్‌డే విషేస్ తెలుపుతూ.. వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా తెరంగ్రేటం చేస్తున్న ఉప్పెన చిత్రం నుండి టీజ‌ర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం.