RRR తరువాత చరణ్ ఆ దర్శకుడితోనే..?

ప్రస్తుతం స్టార్ హీరోలు మరో ఐదేళ్ల వరకు బిజీగా ఉండేలా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని రెడీ చేసుకుంటున్నారు. షూటింగ్స్ లో ఉంటే కథలు వినడానికి కూడా కొన్నిసార్లు తీరిక ఉండదు. కానీ ఈ సారి కరోనా వల్ల చాలా ఖాళీ సమయం దొరికింది. పూర్తిగా కథలు వినడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇక RRR తరువాత రామ్ చరణ్ కూడా భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకు వంశీ పైడిపల్లితో నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయినట్లు టాక్ వచ్చింది. అలాగే ఛలో దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. కానీ అవన్నీ అబద్దాలని క్లారిటీ రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మరొక రూమర్ వైరల్ అవుతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డితో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.