అందుకే ట్రాన్స్ జెండర్ గా మరాను: జబర్దస్త్ సాయి తేజ

జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాయి తేజ ఆ తరువాత అమ్మాయిగా మారాడు. ప్రియాంక(పింకీ) గా పేరు మార్చుకొని తనకు నచ్చిన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తాను ట్రాన్స్ జెండర్ గా మారింది సెక్స్ కోసమో లేక మరొక దాని కోసమో కాదని ఇటీవల ప్రియాంక తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.

ప్రియాంక మాట్లాడుతూ.. ‘నాకు చిన్నప్పటి నుంచే అమ్మాయిగా మారాలని ఉండేది. ఇక 20 ఏళ్ళ వయసులో నా బాడీలో మార్పులపై నాకు ఒక అవగాహన వచ్చింది. వెంటనే సర్జరీ చేసుకొని అమ్మాయిగా మరాను. అయితే ఆపరేషన్ చేసుకున్న తరువాత చాలా నొప్పులు భరించాల్సి వచ్చింది. 85కేజీల బరువు పెరిగాను. సమాజంలో ట్రాన్స్ జెండర్ గా మారిన వారిని ఒక సెక్స్ వర్కర్ అనే చెడు బుద్దితో ఎక్కువగా చూస్తుంటారు. కానీ నేను అలా కాదు. నాలో మార్పుల వల్లే అలా అయ్యాను. ఇక ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను’ అని ప్రియాంక వివరణ ఇచ్చింది.