ఈమెకి ఆమెకి తేడా ఏముంది? ఎందులో తక్కువ? ఎందుకు తక్కువ?

ఇస్మార్ట్ శంకర్ సినిమాకి పూరి టేకింగ్, రామ్ యాక్టింగ్ ఎంత ప్లస్ అయ్యాయో… హీరోయిన్స్ నభా నటేష్, నిధి అగర్వాల్ ల గ్లామర్ షో కూడా అంతే హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా సీ సెంటర్స్ లో ఎక్కువ టికెట్స్ తెగడానికి నిధి, నభాలు చాలా ఉపయోగ పడ్డారు. ఈ సినిమాతో ఇద్దరి కెరీర్స్ స్పీడ్ అందుకుంటాయి అనుకుంటే ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. నిధి ప్రైవేట్ సాంగ్స్, సోషల్ మీడియాలో పోస్ట్లు మాత్రమే చేస్తోంది. రీసెంట్ గా నిధి, గల్లా అశోక్ కుమార్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిన ఈ సినిమా కోసం నిధికి ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేష్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ రెడీ అయ్యారట.

మరో హీరోయిన్ నభా నటేష్ రవితేజ డిస్కో రాజా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, ఈ మూవీ అయ్యాక నభా చేతిలో ఉన్న సినిమాలేంటో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. దాదాపు 50 లక్షల రెమ్యునరేష్ అడగడమే నభాకి అవకాశాలు తగ్గడానికి కారణమని కొందరు అంటున్నారు. అయితే ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత నిధికి కోటి రూపాయలు ఇచ్చినప్పుడు, అదే సినిమాలో నటించి మెప్పించిన నభాకి అందులో సగం ఇవ్వడానికి కూడా మేకర్స్ ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఆలోచించాల్సిన విషయమే. ఈ ప్రశ్నకి సమాధానం తనకి కూడా తెలియదేమో అందుకే నభా కూడా ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.