విజయ్ దేవరకొండ సినిమా రాశికి ఎందుకు అంత స్పెషల్!

విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తన సింగర్ గా అప్పుడప్పుడూ సాంగ్స్ పాడుతూ అలరించిన రాశి ఖన్నా, విజయ్ దేవరకొండ సినిమాలో సొంత డబ్బింగ్ చెప్పుకోబోతోంది. 2014లో ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరపై కనిపించిన రాశి, అయిదేళ్లలో 20 సినిమాలు చేసింది ఇంకో నాలుగు సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి.

వీటిలో ఏ సినిమాకి సొంత గొంతు ఇవ్వని రాశి ఖన్నా, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో డబ్బింగ్ చెప్పింది. పాటలే పడిన రాశి డబ్బింగ్ చెప్పుకోవడంలో ఆశ్చర్యపరిచే విషయం ఏముందిలే కానీ మొదటి సినిమా కాబట్టి డబ్బింగ్ చెప్పడం తనని చాలా ఎగ్జైట్ చేసింది అంటూ రాశి ట్వీట్ ట్వీట్ చేసింది. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.