చావు బ్రతుకుల మధ్య బాలీవుడ్ నటుడు.. ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు

‘మెహందీ’, ‘ఫరేబ్‌’ వంటి చిత్రాల ద్వారా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ బాలీవుడ్ నటుడు ఫరాజ్‌ ఖాన్ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో చావుబతుకుల మధ్య ఉన్నారు. చికిత్స కొసం రూ.25లక్షలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ నటుడు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా సహాయం చేసి తన సోదరుడిని బ్రతికించాలని ఆయన తమ్ముడు ఫామాన్ ఖాన్ మీడియా ముందుకి వచ్చాడు.

బెంగళూరు కన్నింగ్‌హాం రోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫరాజ్ వారం రోజులుగా ల్ ఐసీయూలోనే ఉన్నాడు. అయితే ఇంతవరకు ఉన్న డబ్బు మొత్తం హాస్పిటల్ ఖర్చులకే అయిపోవడంతో ఇంకా 25లక్షలు అవసరం అవుతాయని అందుకే ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇక ఈ నటుడి ఆరోగ్యం గురించి తెలుసుకున్న సిమియర్ నటి పూజా భట్ తనవంతు సహాయం అంధించి అభిమానులు కూడా సహాయం చేయవల్సిందిగా ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు