దసరా తరువాతే వకీల్ సాబ్ పని పూర్తి చేయనున్న పవర్ స్టార్

కరోనా వైరస్ డోస్ తగ్గకపోయినా కూడా సినిమా తారలు మళ్ళీ రెగ్యులర్ షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా తక్కువ మంది యూనిట్ సభ్యులతో షూటింగ్స్ లను కొనసాగిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు షూటింగ్స్ కి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పెండింగ్ లో ఉన్న వకీల్ సాక్ పని పూర్తి చేయడానికి సిద్ధమయ్యాడు.

దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ తుది దశలో ఉన్న విషయం తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మేజర్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక పవర్ స్టార్ దసరా అనంతరం ఆ సీన్స్ ని పూర్తి చేయనున్నాడట. వచ్చే నెల వరకు వీలైనంత వరకు ఆ సినిమా పనులను ముగించుకొని వెంటనే మరో సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నారు. పవన్ నెక్స్ట్ హరీష్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో వర్క్ చేయబోతున్న విషయం తెలిసిందే.