Acharya: ఆచార్య లుక్‌లో డేవిడ్ వార్న‌ర్ హ‌ల్‌చ‌ల్‌..

Acharya: మెగాస్టార్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య టీజ‌ర్‌ను ఇటీవ‌లే చిత్ర‌బృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ మార్క్ ఇమేజ్‌, గ్రేస్ రెండూ ఈ టీజ‌ర్‌లో క‌నిపిస్తాయి. చిరంజీవి అభిమానుల అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా టీజ‌ర్ అద‌ర‌గొట్టింది. విజువ‌ల్స్ ఓ రేంజ్‌లో ఉండ‌గా.. ఇందులో చిరు చెప్పే డైలాగ్‌కు అభిమానులే కాకుండా ప్రేక్ష‌కులు సైతం ఫిదా అయ్యారు. పాఠాలు చెప్పే అల‌వాటు లేక‌పోయినా అంద‌రూ ఎందుకో Acharya ఆచార్య అంటుంటారు. బ‌హుశా గుణ‌పాఠాలు చెప్తాన‌నేమో అని మెగాస్టార్ చెబుతారు.

Warner

అయితే ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్న‌ర్ ఖాళీ స‌మ‌యంలో, సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌తాడు. అదికూడా టాలీవుడ్ మూవీస్‌పై ఆయా హీరోలా వేషాలు వేస్తూ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తుంటాడు. సినిమాల్లోని డైలాగ్స్‌కు లిప్ మూమెంట్ ఇస్తూ.. పాట‌ల‌కు స్టెప్పులేస్తూ ఫాలోవ‌ర్స్‌ను ఆక‌ట్టుకుంటున్నాడు వార్న‌ర్‌. అయితే తాజాగా రీసేఫ్ యాప్‌ను ఉప‌యోగించి.. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన ఆచార్య లుక్‌లో క‌నిపించాడు. Acharya ఆచార్య టీజ‌ర్‌లో చిరంజీవి ఫేస్ స్థానంలో వార్నర్ ముఖం పెట్టి వీడియో రిలీజ్ చేశాడు. దీంతో సోష‌ల్ మీడియాలో ఈ వీడియో మెగాభిమానులును ఖుషీ చేస్తూ.. హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక Acharya ఆచార్య‌ చిత్రాన్ని కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ సినిమాలో సిద్ధ అనే ప్ర‌త్యేక పాత్ర‌ను పోషిస్తున్నాడు. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా, సోనూసూద్ మేన్ విల‌న్‌గా, Acharya ఈ సినిమాలో న‌టిస్తున్నారు.