భారీ భద్రత మధ్య సలార్ షూటింగ్

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సలార్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదావరిఖనిలో జరుగుతోంది. బొగ్గు గనుల్లో షూటింగ్ జరుగుతుండగా.. ఇది నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అందుకే భారీ పోలీస్ భద్రత మధ్య షూటింగ్ చేపడుతున్నారు. ఇటీవలత రామగుండం పోలీస్ కమిషనర్‌ను కలిసిన సలార్ యూనిట్.. తగిన భద్రత కల్పించాలని కోరారు. దీంతో సినిమా యూనిట్ విజ్ఝప్తి మేరకు.. పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

prabahs salaar

భారీ యాక్షన్ సీన్లను ఇక్కడ తెరకెక్కించనున్నారు. అలాగే ప్రభాస్-శృతిహాసన్ కాంబోలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. కాగా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ దీనికి మ్యూజిక్ అందిస్తున్నాడు.