బ్రేకింగ్ న్యూస్: అభిషేక్ బచ్చన్ COVID-19 పాజిటివ్

Abhishek Bachchan
Abhishek Bachchan tests positive for COVID-19

కొరోనావైరస్ కోసం పరీక్షలు చేయించుకోగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది ,ఈ విషయాన్నీ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికి తెలిపారు అయితే కొద్దీ నిమిషాల వ్యవధిలోనే ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా తనకు కూడా కరోనా పాజిటివ్ వచినట్టు నిర్ధారించారు.

ఈ రోజు నా తండ్రి మరియు నేను ఇద్దరూ COVID 19 కి పాజిటివ్ వచ్చింది. తేలికపాటి లక్షణాలు ఉన్న మా ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. మేము అవసరమైన అన్ని అధికారులకు సమాచారం ఇచ్చాము మరియు మా కుటుంబం మరియు సిబ్బంది అందరూ పరీక్షించబడుతున్నారు. భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు.🙏🏽

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తో పాటు తమ ఇతర కుటుంబ సభ్యులకు మరియు స్టాఫ్ కు కూడా టెస్టులు చేయిపించారని అయితే టెస్ట్ నివేదికలు కోసం ఎదురుచూస్తున్నారని అభిషేక్ తన ట్వీట్ ద్వారా పేర్కొన్నారు.