నందమూరి కుటుంబం నుండి మరో హీరో?

గత కొద్ది రోజులుగా సంచలన దర్శకుడు వైవిఎస్ చౌదరి, స్వర్గీయ నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు స్వర్గీయ నందమూరి జానకిరామ్ గారి తనయుడిని హీరోగా వెండితెరకు పరిచయం చేయనున్నారు అనే వార్త ఫిలిం నగర్ వర్గాలలో తెగ చక్కర్లు కొడుతుంది.జానకిరామ్ గారు కొన్నేళ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించిన సంగతి తెలిసిందే. అతని పెద్ద కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావు. అయితే జానకిరామ్ తనయుడు ఎన్టీఆర్ ఫోటోలు ఇంటర్నెట్ లో ఎక్కడా లేకపోవడం గమనార్హం. చిన్నప్పుడు ఓ ఫంక్షన్ కి సంబంధించిన ఫోటోలు తప్ప పెద్దయ్యాక ఎలా ఉంటాడు అనే ఫోటోలు లేవు. దీంతో ఆ హీరో ఎలా ఉన్నాడో అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది… అదేంటంటే ఆస్కార్ గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారని.. మరియు లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు, మాస్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్ర గారు, డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కూడా ఈ సినిమాకోసం వర్క్ చేస్తున్నారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఈ వార్త తెగ వైరల్ గా మారింది..

ఇక వైవిఎస్ చౌదరి గారి విషయానికి వస్తే పరిచయం అవసరం లేని పేరు అనే చెప్పుకోవాలి. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వైఎస్ చౌదరి గారు 1998లో గ్రేట్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా హీరో నాగార్జున ప్రొడ్యూస్ చేసినటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం చూదము రారండి చిత్రంతో దర్శకుడిగా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం అయ్యి మొదటి చిత్రం తోనే గొప్ప విజయాన్ని అందుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవీఎస్ చౌదరి ఒకరు ఈయన అప్పట్లో తీసిన లాహిరి లాహిరి లాహిరి లో, సీతయ్య లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఆయనకు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ని లాంటి యంగ్ హీరోని ఇండస్ట్రీ కి పరిచయం చేస్తూ ఆయన చేసిన దేవదాస్ సినిమా కూడా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని అందుకుంది. తరువాత వైవీఎస్ చౌదరి మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ని కూడా తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అలాగే స్క్రీన్ రైటర్ గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్ గా, ఎగ్జిబిటర్గా మ్యూజిక్ లేబిల్ ఓనర్ గా అయినా దినదిన అభివృద్ధి చెందారు. ఆయన ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉన్నవారే.

నందమూరి హరి కృష్ణ గారితో సీతయ్య, లాహిరి లాహిరి లాహిరిలో వంటి అద్భుతమైన సినిమాలు తీసిన YVS చౌదరి గారు నందమూరి కుటుంబానికి ఆప్తులు కూడాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రానున్న ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ నడుస్తుంది.