అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా  ‘దేవకీ నందన వాసుదేవ’ నుంచి ఏమయ్యిందే ప్రోమో విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు మనవడు, ప్రిన్స్ మహేష్ మేనల్లుడు అయిన గళ్ళ అశోక్ హీరో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గుణ 369 సినిమా దర్శకుడు జంధ్యాల అర్జున్ దర్శకత్వమో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కథ రాసింది హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కావడం విశేషం. డైలోగ్స్ బుర్రా సాయి మాధవ్ రాయగా లలితాంబిక ప్రొడక్షన్స్‌లో ప్రొడక్షన్‌ నెం. 1గా ఎన్‌ఆర్‌ఐ సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు.

గతంలో వచ్చిన టీజర్ అద్భుతంగా ఉంది అంటూ మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈరోజు గళ్ళ అశోక్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఏమయ్యిందే ఫస్ట్ సింగిల్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్ సినిరోలియో చొంపొసె చేయడం విశేషం. ఈ సినిమాలో వారణాసి మానస అశోక్ తో జంటగా నటిస్తుంది. అయితే త్వరలోనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేస్తామని మేకర్స్ అంటున్నరు.

ఈ సినిమాకి డీఓపిగా మూరెళ్ళ ప్రసాద్, ఇంకా ఎడిటర్ గా తమ్మిరాజు పని చేస్తున్నారు.

నటీనటులు: అశోక్ గల్లా, వారణాసి మానస

సాంకేతిక సిబ్బంది:
కథ: ప్రశాంత్ వర్మ
దర్శకత్వం: అర్జున్ జంధ్యాల
నిర్మాత: సోమినేని బాలకృష్ణ
బ్యానర్: లలితాంబిక ప్రొడక్షన్స్
సమర్పణ: నల్లపనేని యామిని
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: తమ్మిరాజు
డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
పీఆర్వో: వంశీ-శేఖర్