‘సత్య’ హీరోయిన్ ప్రార్థన సందీప్ ప్రేమలు డైరెక్టర్ రిలేషన్ తెలుసా?

సత్య అనే టైటిల్ తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎం కాదు. ఈ టైటిల్ తో వచ్చిన RGV సినిమా గతంలో మంచి హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ టైటిల్ తో మరో సినిమా రాబోతుంది. తమిళ్ లో రంగోలి అనే టైటిల్ తో వచ్చిన సినిమా హిట్ కొట్టింది. అయితే ఇప్పుడు అదే సినిమాను తెలుగులోకి తీసుకుని వచ్చారు శివమ్ మీడియా అధినేత సీనియర్ జర్నలిస్ట్ శివ మల్లాల.
ఇక తారంగంకి వస్తే హీరోగా తమిళ్ చైల్డ్ ఆర్టిస్ట్ హేమరేష్ ఈ చిత్రం తో తొలి హీరోగా అడుగుపెడుతున్నారు. హీరోయినిగా మలయాళం చైల్డ్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రార్థన సందీప్ తొలిసారి హీరోయినిగా రాబోతున్నారు. అయితే ఇటీవలే మలయాళం సినిమా అయినా ప్రేమలు అటు మళయాళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి కలెక్షన్ లు రాబట్టాయి. ఆ చిత్ర దర్శకుడు అయినా గిరీష్ కుటుంబం నుండి వచ్చిన ఈమె ఇప్పుడు హీరోయిన్గా ఎంత వరుకు మెప్పిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే 15 పైగా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి ప్రార్థన సందీప్, ఇప్పుడు హీరోయినిగా మన ముందుకు రానుంది. మలయాళ దర్శకులు గిరీషకు స్వయానా సోదరుడి కూతురు కావడం విశేషం. ఇక తమిళంలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమాను తెలుగు ప్రజలు ఎంత ఆదరిస్తారో వేచి చూడాలి.