National News: పెట్రో ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఓ వ్య‌క్తి స్కూటీ ఎత్తి న‌డుస్తూ నిర‌స‌న‌..

National News: భార‌త్‌లో చ‌మురు ధ‌ర‌లు రికార్డు స్థాయికి పెరిగాయి.. దీంతో దేశంలోని మ‌ధ్య త‌ర‌గతి ప్ర‌జ‌లు భారం మోయాల్సి వ‌స్తోంది. భార‌త్‌లో పేద, ధ‌నిక అంత‌రాలు చాలా ఎక్కువ‌గా ఉన్నాయి.. ధ‌నికుల‌పై ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుద‌ల ప్ర‌భావం ఏమీ ఉండ‌దు కానీ.. పేద‌రికంలో ఉన్న‌వారిపై, మ‌ధ్య‌త‌ర‌గతి ప్ర‌జ‌ల‌పై దీని ప్ర‌భావం చాలా ఉంటుంది. మెట్రో న‌గ‌రాల్లో రూ.90ని క్రాస్ చేసిన లీట‌ర్ పెట్రోల్ ధ‌ర‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రూ.100కూడా దాటింది. దేశంలో ఇంధ‌న ధ‌ర‌ల‌ను అదుపులోకి తీసుకు రావాల‌ని సామాన్యులు కోరుతున్నారు.

Protests

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భారంగా మారాయి అంటూ నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. కొంద‌రు వినూత్నంగా నిర‌స‌న‌లు తెలుపుతున్నారు. కాగా ఈ క్ర‌మంలో తాజాగాNational News హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కుల్లూ జిల్లాలో ఓ వ్య‌క్తి రాంశిలాలోని గాయ‌మ‌న్ వంతెన వ‌ద్ద ఓ యువ‌కుడు ఏకంగా స్కూటీని ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు.. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీంతో సోష‌ల్ మీడియాలో పెరుగుతున్న చ‌మురు ధ‌ర‌ల‌కు వ్య‌తిరేకంగా ఇలా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఈ విధంగా ఇంధ‌న ధ‌ర‌లు పెరుగుద‌ల‌పై వినూత్నంగా National Newsస్కూటీ ఎత్తి న‌డుచుకుంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశాడు అని అంటున్నారు.