RGV: డి కంపెనీ మోష‌న్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన ఆర్‌జీవి..

RGV: వివాదాస్ప‌ద ద‌ర్శకుడు రాంగోపాల్ వ‌ర్మ ఆయ‌న చేసే చిత్రాలు చాలా వైవిధ్యంగా ఉంటాయ‌నే విష‌యం తెలిసిందే.. హ‌ర్ర‌ర్ క‌థ‌లు, డాన్ క‌థ‌లు, శృంగారం వంటి క‌థ‌లు ఇలా త‌న‌దైన శైలిలో చిత్రాల‌ను తెర‌కెక్కిస్తాడు.. ఈ నేప‌థ్యంలోనే త‌న‌కు న‌చ్చే ముంబై మాఫియా డాన్ దావుద్ ఇబ్ర‌హీం క‌థ ఆధారంగా డి కంపెనీ చిత్రం తెర‌కెక్కిస్తున్నాడుRGV.

RGV D Company

తాజాగా ఈ చిత్రం కు సంబంధించి మోష‌న్ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేశాడు ఆర్‌జీవి. ముంబై అండ‌ర్ వ‌రల్డ్ డాన్ అంటే ఎలాగుంటుందో తమ చిత్రంలో చూడొచ్చ‌ని రాసుకొచ్చాడు వ‌ర్మ‌. అలాగే ఈ చిత్రం ట్రైల‌ర్‌ను రేపు సాయంత్రం 5గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నామ‌ని ఆర్‌జీవి పేర్కొన్నాడు. ఇక ఈ చిత్రం మార్చి 26న ధియేట‌ర్లోకి రానుంద‌ని ఇటీవ‌లే RGVప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.