నాగబాబు, మెగా బ్రదర్ అయినా కూడా జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. ప్రతి గురువారం, శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులని నవ్వుల బాబుగా అలరించే నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మల్లెమాల ఏడేళ్లుగా చేస్తున్న కామెడీ షో జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ కి రోజా, నాగబాబు జడ్జిలుగా ఉన్నారు. టీం లీడర్స్ కన్నా ఎక్కువగా ఫేమస్ అయిన ఈ ఇద్దరూ షోని సూపర్బ్ గా నడిపించారు. అయితే మల్లెమాలతో వచ్చిన చిన్న గొడవ కారణంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ డైరెక్టర్స్ నితిన్ భరత్ లు షోస్ నుంచి తప్పుకున్నారు.
నితిన్ భరత్ లతో మంచి సంబంధాలు ఉన్న నాగబాబు కూడా షోస్ నుంచి వెళ్లిపోయాడని అంతా అనుకుంటున్నారు. ఈ వార్త నిజమో లేదో కన్ఫామ్ చేసుకునే లోపు జీ తెలుగు పెద్ద బాంబు పేల్చింది. ఢీ ఛాంపియన్స్ షోలో హోస్ట్ గా మిస్ అయిన ప్రదీప్, ఈ షోలో ప్రత్యక్షమయ్యాడు. దేత్తడి పిల్ల హారిక, యాంకర్ రవి కలిసి చేస్తున్న ఈ షో పేరు సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి?… నవంబర్ 24 ఆదివారం టెలికాస్ట్ కానున్న ఈ షో ప్రోమోలో నాగబాబు కూడా కనిపించి, ఇంద్ర రేంజులో డైలాగ్ చెప్పాడు. పంచె కట్టులో వచ్చిన నాగబాబుని చూసిన తర్వాత, ఇన్ని రోజులు వినిపిస్తున్న మాట నిజమే నాగబాబు జబర్దస్త్ నుంచి అవుట్ అయ్యాడు అని ఫిక్స్ అయిపోయారు. అయితే చాలా మందికి తెలియదో లేక ఎవరూ పట్టించుకోవట్లేదో ఏమో కానీ జీ తెలుగు రిలీజ్ చేసిన ఈ ప్రోమో రెగ్యులర్ షోది కాదు, ఈవెంట్ ది. ప్రతి పండగకి ఈటీవీ ఎలా ఈవెంట్ చేస్తుందో, జీ తెలుగు కూడా అలానే సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అనే ఈవెంట్ ని చేసింది. కార్తీక మాసం సందర్భంగా ఈ ఈవెంట్ ని నవంబర్ 24న టెలికాస్ట్ చేయనున్నారు.
నాగబాబు, ప్రదీప్, యాంకర్ రవిలే కాదు ఈ ఈవెంట్ లో అనసూయ, చమ్మక్ చంద్ర, వేణు, ధన్ రాజ్, చిట్టి మాస్టర్, అక్సా ఖాన్, కిరాక్ ఆర్పీ కూడా కనిపించనున్నారు. వీరిలో వేణు, ధన్ రాజ్ ఇప్పటికే దూరమవ్వగా… చంద్ర, ఆర్పీ కూడా జబర్దస్త్ ని వదిలేస్తున్నారు అనే రూమర్ వినిపిస్తోంది. మెగా బ్రదర్ మల్లెమాల టీంని జబర్దస్త్ అండ్ ఎక్ట్రా జబర్దస్త్ షోస్ ని వదిలి వెళ్లడం ఎంత వరకూ నిజం అనేది ఇప్పటికైతే తెలియదు కానీ సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ప్రోగ్రాం మాత్రం ఒక్కరోజు ప్లే అయ్యే ఈవెంట్ అని కాన్ఫిడెంట్ గా చెప్పగలం. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద పెట్టిన ఫొటోలో హైలైట్ చేసిన డిస్క్రిప్షన్ చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.