సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తూ టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తూ సినిమాని తెరకెక్కిస్తాడు. శంకర్ ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు 2 తర్వాత బాలీవుడ్ యాక్షన్ హీరో హృతిక్ రోషన్‌తో మూవీ చేయబోతున్నాడట. 2.ఓ సినిమాలో అక్షయ్ కుమార్ చేసిన పాత్ర కోసం ముందుగా శంకర్, హృతిక్ ను సంప్రదించాడు కానీ అప్పుడు వేరే కమిట్మెంట్స్ ఉండడంతో రోబో 2. ఓ సినిమా చేయలేక పోతున్నానని చెప్పిన హృతిక్ రోషన్ మరో ప్రాజెక్టు చేద్దామని అన్నాడట. ఇప్పుడు అదే కమిట్మెంట్ తో శంకర్ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి టాక్స్, స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నట్టు సమాచారం.
సూపర్ హీరో సబ్జెక్ట్‌ని బేస్ చేసుకోని, హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టు సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంలో శంకర్ లైన్ వినిసించడట. కథకి కనెక్ట్ అయిన హృతిక్ , శంకర్ డైరెక్షన్లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని బి-టౌన్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు చాలామంది ఆసక్తిని చూపుతున్నరట. ఇండియన్ 2 మూవీ తర్వాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. శంకర్ విజన్, హృతిక్ యాక్టింగ్ స్కిల్స్ తోడైతే ఇక బాక్సాఫీస్ దగ్గర సంచలం సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.