అతడే శ్రీమన్నారాయణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దెగ్గర అయిన కన్నడ నటుడు రక్షిత్ శెట్టి. kgf, సలార్ లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న బ్యానర్ హోమ్బేల్ ఫిల్మ్స్. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమా రిచర్డ్ అంటోనీ. లార్డ్ ఆఫ్ సీ అనే ట్యాగ్ లైన్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి రక్షిత్ కథ ఇస్తూ డైరెక్ట్ కూడా చేస్తుండడం విశేషం. 2014లో ఉలిదవారు కందంతు అనే సినిమా వచ్చింది. నియో నాయర్ స్క్రీన్ ప్లే తో క్రైమ్ డ్రామాగా వచ్చిన ఈ యాంతోలజిలో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ రైటర్ అండ్ డైరెక్టర్ గా చేశాడు. కోలీవుడ్ లో మొదటి సారి సింక్ సౌండ్ టెక్నాలజీతో వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఒక కొత్త మూవీ మేకింగ్ ని చూపించిన రక్షిత్ శెట్టి, దాదాపు ఏడేళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ చేస్తున్నాడు. డైరెక్టర్ చైర్ లో కూర్చుంటూనే రక్షిత్ శెట్టి, కెమెరా ముందు కూడా కనిపించనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో యుట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. రిచర్డ్ అంటోనీ 1963-1991 అనే సమాధి చూపించారు అంటే ఈ మూవీ పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని అర్ధం అవుతోంది. కొంత మంది మాత్రం రిచర్డ్ అంటోనీ హారర్ మూవీ అయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డు పడాలి అంటే చాలా కాలమే ఆగాలి. ఇదిలా ఉంటే 24 గంటల్లోనే రిచర్డ్ అంటోనీ వీడియో 11 మిలియన్ వ్యూస్ రాబట్టింది. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ తెలియాల్సి ఉంది.