సూపర్ స్టార్ సర్కార్ వారి పాట అందుకున్నాడు…

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న‌ తాజా చిత్రం స‌ర్కార్ వారి పాట‌. ఈ సినిమా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా.. జీఎంబీ ప్రొడ‌క్ష‌న్స్‌, 14రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేశ్ స‌ర‌స‌న కీర్తిసురేశ్ తొలిసారి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను దుబాయ్‌లో ప్లాన్ చేయ‌గా అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ని కంప్లీట్ చేసి యూనిట్ అంతా ఇండియా వచ్చేశారు. ఇక్కడ సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ హిట్ చేసి షూటింగ్ ఆగిపోయేలా చేసింది. కరోనా ప్రభావం తగ్గడంతో సర్కార్ వారి పాట మేకర్స్ షూటింగ్ ని మళ్లీ మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ప్రొడ్యూసర్స్ మహేశ్ అండ్ డైరెక్టర్ ఉన్న ఫోటోని ట్వీట్ చేశారు. మహేశ్ ఫేస్ కనిపించకున్నా కూడా ఘట్టమనేని అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. థర్డ్ వేవ్ హిట్ చేసే లోపు సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేసి ఈ మూవీని సంక్రాంతి బరిలో నిలబెట్టాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి సర్కారు వారి పాట జోష్ మాములుగా ఉండదు.

Maheshbabu New movie update

Maheshbabu మ‌హేశ్‌తో పాటు చిత్ర‌యూనిట్ అంతా దుబాయ్‌లో ఈ చిత్ర‌ షూటింగ్ జ‌రుపుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి ఎస్‌.ఎస్. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.