బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భుజ్- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. 1971లో రాజస్తాన్ లోని భుజ్ ఎయిర్పోర్ట్ పైపాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడి చేసింది . ఈ ఊహించని దాడిలో పాకిస్థాన్ భుజ్ ఎయిర్పోర్ట్ ని బాగా దెబ్బ తీసింది. పాక్ ఇండియాపై యుద్ధం చేయడానికి ప్రణాళిక రచించి, భుజ్ రన్ వేని ద్వంసం చేస్తే సైన్యానికి ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ దొరకకుండా చెయొచ్చు అని భావించిన పాకిస్థాన్ ఈ పని చేసింది. ఈ ఎటాక్ జరిగిన టైంలో ఎయిర్పోర్ట్ అధికారిగా ఉన్న IAF విజయ్ కర్నిక్ అతని టీంతో కలిసి… చుట్టు పక్కన ఉన్న గ్రామాలలోని 300 మంది అమ్మాయిల సాయం తీసుకోని భుజ్ ఎయిర్ బేస్ ని ఒక్క రోజులో సిద్ధం చేశాడు. వాయు వేగంతో ఎయిర్ బేస్ ని రెడీ చేసిన విజయ్ కర్నిక్, దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా ఇండియాని యుద్ధంలో గెలిపించి మన జెండా ఎగిరేలా చేశాడు.
ఇంతటి వీరోచిత కథతో అభిషేక్ డైరెక్ట్ చేసిన భుజ్ సినిమాలో అజయ్ దేవగన్ తో పాటు సంజయ్ దత్, సోనక్షి సిన్హా, నోరా ఫతేహి, ప్రణీత సుభాష్, శరద్ కేల్కర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్స్ మూత పడడంతో భుజ్ మూవీని మేకర్స్ డిస్నీ+హాట్ స్టార్ లో ప్రీమియర్ చేయడానికి రెడీ అయ్యారు. ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకోని ఆగష్టు 13న భుజ్ మూవీ ఫస్ట్ ప్రీమియర్ కానుంది.