OTT ప్లాట్ఫార్మ్స్ వల్ల కొత్త కొత్త క్రియేటివ్ కంటెంట్ బయటకి వస్తుంది. ముఖ్యంగా ఇండియా నుంచి క్రియేటివ్ కంటెంట్ బయటకి వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తోంది. డిఫరెంట్ జనార్ ఆఫ్ కంటెంట్ ఇస్తూ అమెజాన్, నెట్ ఫ్లిక్స్ కి గట్టిపోటీ ఇస్తున్న ఇండియన్ ఒటీటి ‘జీ 5’ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ స్టేట్ ఆఫ్ సీజ్: టెంపుల్ ఎటాక్. గతంలో వచ్చిన స్టేట్ ఆఫ్ సీజ్: 26/11 సిరీస్ కి ఇది కొనసాగింపు. ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు నివాళిగా ‘స్టేట్ ఆఫ్ సీజ్ పార్ట్ 1 తెరకెక్కింది. తాజాగా వచ్చిన రెండో సీజన్ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ను జీ5 ఒరిజినల్ మూవీగా తెరకెక్కించారు. ‘జీ 5’ ఒరిజినల్ మూవీ ‘స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్’ ‘జీ 5’లో ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతోంది. హిందీ, తమిళ్, తెలుగులో ఏకకాలంలో ప్రీమియర్ అవనుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇందులో సీనియర్ హీరో అక్షయ్ ఖన్నా మెయిన్ లీడ్ ప్లే చేశాడు. ఎన్నో ఆర్మీ బేస్డ్ మూవీల్లో నటించిన అక్షయ్ ఖన్నా చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ యూనిఫామ్‌లో కనిపిస్తుండటం విశేషం. ‘స్టేట్ ఆఫ్ సీజ్: 26/11’ ఎన్ఎస్జీ కమాండోగా నటించిన వివేక్ దహియాను ఈ పార్ట్ 2లో యాక్ట్ చేశాడు. వీరితో పాటు గౌతమ్ రోడె, సమీర్ సోని, పర్వీన్ దబాస్, మంజరి ఫడ్నవీస్ ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కాంటిలో పిక్చర్స్ (అభిమన్యు సింగ్) స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ ఎటాక్ ని ప్రొడ్యూస్ చేస్తుండగా, ‘అభరు 2’కు దర్శకత్వం వహించిన కెన్ ఘోష్ దర్శకత్వం వహించాడు. కర్నల్ (రిటైర్డ్) సందీప్ సేన్ (26/11 భయానక ముంబయి దాడుల సమయంలో ఎన్‌ఎస్‌జీకికి సెకండ్ ఇన్ కమాండ్) ఈ స్టేట్ ఆఫ్ సీజ్ ప్రాజెక్టులకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ వీక్ ఎండ్ మంచి దేశ భక్తి సినిమా చూడాలి అనుకున్న వాళ్లు ఈ స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ ఎటాక్ పై ఒక లుక్కేయండి.