తమిళనాడు ఎమ్మెల్యే హీరోగా బాలీవుడ్ రీమేక్ ఆర్టికల్ 15…

తమిళనాట 2021లో జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ముఖ్యమంత్రిగా గెలిచాడు. DMK పార్టీ తరపున పోటీ చేసిన హీరో ఉదయనిధి స్టాలిన్ కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. రాజకీయాల్లోకి వెళ్లిన ఉదయనిధి స్టాలిన్ సినిమాలకి దూరం అవుతాడు అనుకుంటే దేని లెక్క దానిదే అంటూ బాలీవుడ్ హిట్ సినిమానే రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. 2019లో బాలీవుడ్ నుంచి వచ్చిన ఫైనేస్ట్ సినిమాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సినిమా ఆర్టికల్ 15. ఆయుష్ మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ మూవీని అనుభవ్ సిన్హా తెరకెక్కించాడు.

భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 15’ ప్రకారం ఏ పౌరుడిని కులం, మతం, సెక్స్, పుట్టిన స్థలం కారణంగా చూపించి దూషించకూడదు, దాడి చేయకూడదు. ఆర్మీ వాళ్లు ఎక్కువగా వాడే ఈ ఆర్టికల్ 15ని బేస్ చేసుకోని ఆర్టికల్ 15 సినిమా తెరకెక్కింది. తమిళనాట కుల ప్రస్తావన ఉన్న సినిమాలకి మంచి ఆదరణ ఉంది. అందుకే ఉదయనిధి స్టాలిన్ ఈ మూవీని తమిళంలో రీమేక్‌ చేయబోతున్నారు. అరుణరాజా కామరాజ్‌ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు చివరి నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. శివానీ రాజశేఖర్‌ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక మాగిజ్‌ తిరుమేనితో దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో మూవీలోనూ ఉదయనిధి నటిస్తున్నారు.