మెగాస్టార్ చిరంజీవి, కమర్షియల్ అనే పదానికే కొత్త అర్ధం చెప్పిన డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషణ్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆచార్య. గత ఏడాదిలోనే అన్ని పనులు కంప్లీట్ చేసుకోని సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు కానీ ప్లాన్ ప్రకారం ఏది జరగకపోవడం, కరోనా రావడంతో సంక్రాంతి నుంచి వాయిదా వేసి సమ్మర్ ని టార్గెట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా బ్యాలన్స్ ఉండడంతో సమ్మర్ టార్గెట్ కూడా మిస్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ నుండి పరిస్థితులు చక్కబడడంతో ఇటీవల ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభం అయింది. నేటి నుండి ఆచార్య సినిమా షూటింగ్ మొదలయినట్టు మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్ తో పాటు చరణ్, సోనూసూద్ అలాగే కీలక పాత్రలు పోషిస్తున్న నటీ నటులపై కొరటాల పెండింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కేవలం వారం నుండి పది రోజుల్లోనే ఈ షెడ్యూల్ పూర్తి చేస్తారట. అన్నీ జాగ్రత్తలతో ఆచార్య షూటింగ్ ను నిర్వహిస్తున్నారు. ఒకవైపు షూటింగ్ ను జరుపుతూనే మరొకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా జరుపుతున్నారట.
ఇక భారీ స్థాయిలో అంచనాలున్న ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో అందరిలోనూ ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దసరా సీజన్ లో ఆచార్య సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికి ఇప్పటికే పోస్ట్ పోన్ అయిన సినిమాలు పోటీ ఉండే అవకాశం ఉంది. దాంతో ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జులై మూడు వారం నుండి థియేటర్లు ఓపెన్ అవుతాయట. ఆగస్టు మొదటి నుంచి థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడుపుకునేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్ పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.