కృష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన హీరోయిన్ మెహ్రీన్. క్యూట్ అండ్ బబ్లీగా ఉండే ఈ పంజాబీ అమ్మాయి మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలతో సక్సస్ లు అందుకోని మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంత కాలంగా సరైన హిట్ పడక పోవడంతో మెహ్రీన్ కెరీర్ కష్టాల్లో పడింది. దీంతో ఈ ముద్దుగుమ్మ, కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ బిశ్నోయ్ కొడుకు భవ్యా బిశ్నోయ్ తో పెళ్లికి సిద్ధం అయ్యింది. ఈ ఏడాది మార్చ్ 13న మెహ్రీన్, భవ్యా బిశ్నోయ్ ల ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. అతికొద్ది మంది అతిధుల మధ్యలో గ్రాండ్ గా జరిగిన ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఎలాంటి అప్డేట్ లేకుండా మెహ్రీన్ ఇలా సడన్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం ఏంటి అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అయితే మెహ్రీన్ అందరికీ షాక్ ఇస్తూ త్వరలో జరగాల్సిన తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది.
ఈ విషయాన్ని తనే అనౌన్స్ చేసిన మెహ్రీన్, ఇకపై భవ్యా బిశ్నోయ్ తో కానీ అతని కుటుంబ సభ్యులతో కానీ తనకి ఎలాంటి సంబంధం లేదు. తన నిర్ణయాన్ని, తన ప్రైవసీనీ అందరూ గౌరవించి ఇకపై ఈ విషయం గురించి చర్చించక పోతే బాగుంటుదని మెహ్రీన్ ట్వీట్ చేసింది. అయితే ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాలో నటిస్తున్న మెహ్రీన్ కి త్వరలో ఒక సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అతనే అయి ఉంటాడని కొందరి అభిప్రాయం. ఆ సీనియర్ హీరో ఎవరు? మెహ్రీన్ నటించబోయే ఆ సినిమా ఏది అనేది ఇంకా బయటకి అయితే రాలేదు కానీ మెహ్రీన్ మాత్రం తన నిశ్చితార్ధాన్ని క్యానిల్ చేసుకుంది. ఇలా హీరోలు హీరోయిన్లు ఎంగేజ్మెంట్ చేసుకోవడం, క్యాన్సిల్ చేసుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమి కాదు తన డెబ్యుతోనే సూపర్ హిట్ కొట్టి, అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఒక అమ్మాయి కూడా ఇలానే పెళ్లికి ముందు ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసుకుంది.