జగన్ బయోపిక్… ఏపీ సీఏంగా స్కామ్ 1992 హీరో

ఆనందో బ్రహ్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు మహి వి రాఘవ, ఆ తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి నటించిన ఈ మూవీ, 2019 ఫిబ్రవరి 8న విడుదలై ప్రేక్షకులని మెప్పించింది. ఈ మూవీ హిట్ అయిన టైములోనే ‘యాత్ర’ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని మహీ వి. రాఘవ అనౌన్స్ చేశాడు.

రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత జగన్ చేసిన ఓదార్పు యాత్ర, జైలులో గడపడం, కష్ట పడడం అనే ఎలెమెంట్స్ తో ఈ సీక్వెల్ ఉండేలా ఉంది. గతంలో ఈ జగన్ బయోపిక్ గురించి వార్తలు వచ్చినప్పుడు… ‘జగన్‌గారి పాత్రలో నటించేందుకు నన్ను సంప్రదిస్తే కచ్చితంగా నటిస్తా’ అని తమిళ హీరో సూర్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మహి వి రాఘవ ఫిల్మ్ లో జగన్ గా సూర్య నటిస్తారనే వార్తలు వచ్చాయి. అయితే తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు, ‘స్కామ్‌ 1992’ వెబ్‌ సిరీస్‌ తో నేషనల్ వైడ్ ఫేమ్‌ తెచ్చుకున్న ప్రతీక్‌ గాంధీ నటించనున్నాడు.

ప్రస్తుతం హిందీలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ప్రతీక్‌, మహీ చెప్పిన కథ విని చాలా ఎగై్జట్‌ అయి, నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. జగన్‌ సొంతంగా పార్టీ స్థాపించడం, పాదయాత్ర, ఎదుర్కొన్న సవాళ్లు, ముఖ్యమంత్రి కావడం వంటి అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని తెలిసింది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రానున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.