సుశాంత్ సింగ్… బాలీవుడ్ లో చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా కావాల్సినంత ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మంచి నటుడి కన్నా మంచి మనిషి అని పేరు తెచ్చుకున్న సుశాంత్ ని హిందీ చిత్ర పరిశ్రమ అవుట్ సైడర్ ని చేసి అవకాశాలు లేకుండా చేసింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన సుశాంత్ గతేడాది ఆత్మహత్య చేసుకున్నాడు. బాలీవుడ్ నెపోటిజం గురించి విమర్శలు వెల్లువెత్తేలా చేసిన ఈ సంఘటనని ఎవరూ అంత ఈజీగా మర్చిపోయి ఉండరు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే మరో అవుట్ సైడర్ బాలీవుడ్ లో దాదాపు ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నాడు కాబట్టి. యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్, ఫ్యూచర్ స్టార్ గా కాంప్లిమెంట్స్ అందుకున్న కార్తీక్ ఆర్యన్ ని బాలీవుడ్ ఇండస్ట్రీ సైడ్ చేస్తుందా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
ప్యార్ కా పంచనామా, సోను కే టిటు కి స్వీటీ, కాంచి, లూకా ఛుప్పి, పతి పత్ని ఔర్ ఓ, లవ్ ఆజ్ కల్ 2 లాంటి హిట్స్ ఇచ్చిన కార్తీక్ ఆర్యన్… బాలీవుడ్ కింగ్ మేకర్ అయిన కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో దోస్తానా 2 చేయడానికి ఒప్పుకున్నాడు. దాదాపు సగం షూటింగ్ అయ్యాక ఏ సమస్య వచ్చిందో తెలియదు కానీ అతని పద్దతి బాగోలేదు, ప్రవర్తన బాగోలేదు అంటూ దోస్తానా 2 నుంచి అతన్ని తొలగించారు. ఈ విషయం బాలీవుడ్ లో చాలా పెద్ద దుమారమే లేపింది. ఇది మర్చిపోయే లోపే కార్తీక్ ఆర్యన్ మరో షాక్ ఇచ్చాడు. కింగ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రెడ్ చిల్లీస్ లో కార్తీక్ ఆర్యన్ ఒక సినిమాకి సైన్ చేశాడు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించనున్న ఈ ప్రాజెక్ట్ లో దర్శకుడు అజయ్‌తో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో కార్తీక్ ఆర్యన్ ఈ ప్రాజెక్టుకు గుడ్ బై చెప్పేశాడు. ఇది వరకు చెప్పిన స్టోరీ లైన్‌కు, ఇప్పటి స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడని సమాచారం. రెండేళ్ల క్రితమే సైన్ చేసిన ఈ మూవీకి అతను రెండు కోట్ల అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని కార్తీక్ ఆర్యన్ తిరిగి ఇచ్చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అతను ధమాకా, భూల్ బులయ్యా 2 సినిమాల్లో నటిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు తప్ప కార్తీక్ ఆర్యన్ చేతిలో మరో సినిమా లేదు. కరణ్ జోహార్, రెడ్ చిల్లీస్ లాంటి ప్రొడక్షన్ హౌసుల నుంచి తప్పుకున్నాడు అంటే వేరే బడా ప్రొడ్యూసర్స్ అతనికి ఛాన్స్ ఇస్తారో లేదో అనే అనుమానం అభిమానుల్లో ఉంది. ఇండస్ట్రీ అతన్ని కార్నర్ చేస్తుందా? లేక అతనే ఇమడలేక తప్పుకుంటున్నాడా అనేది తెలియదు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం కార్తీక్ ఆర్యన్ డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశం ఉంది.