ఇంత క్లాస్ గా ఉండి… రిపేర్లు చేస్తాడా?

ఇచ్చట అన్ని వాహనాలు రిపేర్ చేయబడును… యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ట్యాగ్ లైన్ ఇది. మొక్కలతో పాటు మనుషులని కూడా కాపాడుకోవాలని చెప్పిన ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్ లో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతూ ఇంకో మూవీ చేయబోతున్నారు. ఈ విషయమై ఇటీవలే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ నుంచి విషెస్ చెప్తూ పోస్టర్ బయటకి వచ్చింది. కూల్ అండ్ చార్మింగ్ గా ఉన్న ఎన్టీఆర్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది.

ఇంత క్లాస్ లుక్ తో కొరటాల శివ ప్యాన్ ఇండియన్ సినిమా ఎలా చేస్తున్నాడు అంత ధైర్యం ఏంటి? అందరూ భారీ భారీ సినిమాలు చేస్తుంటే ఇంత కూల్ లుక్ ని హీరో ని ఎలా పోట్రె చేస్తున్నాడు? అసలు అతని నమ్మకం ఏంటి? పైగా ఈసారి బౌండరీస్ దాటి వెళ్తాను అని చెప్పాడు అంత తెగింపు ఎక్కడిది అంటూ ప్రశ్నలు వినిపించొచ్చు కానీ… మే బీ కొరటాల ధైర్యం పేరు నందమూరి తారక రామారావు అయి ఉండొచ్చు. ఏ పాత్ర అయినా చేయగలిగే ఎన్టీఆర్ సత్తా, కొరటాల నమ్మకం అయి ఉండొచ్చు. యావరేజ్ సినిమాలతో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేసే ఎన్టీఆర్ స్టామినా కొరటాల తెగింపు అయి ఉండొచ్చు. ముందు అర్జునుడిని పెట్టి వెనకుండి కృష్ణుడు మహాభారత యుద్ధం నడిపినట్లు, నందమూరి తారక రామారావుని ముందు పెట్టి కొరటాల శివ పాన్ ఇండియా యుద్ధం చేయడానికి సిద్దమవుతున్నాడు, ఈ యుద్ధం గెలిచి తీరాల్సిందే.