గోండు బెబ్బులి… చరణ్ ఎన్టీఆర్ లుక్స్ కి ఉన్న తేడా అదే

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అరవింద సమేత వీర రాఘవ. జగపతిబాబు విలన్ గా నటించిన ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది… మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టా ఉంటాదో తెలుసా? మచ్చల పులి మొహం మీద గాండ్రిస్తే ఎట్లుంటాడో తెలుసా? అని, ట్రిపుల్ ఆర్ నుంచి రాజమౌళి వదిలిన పోస్టర్ చూస్తే త్రివిక్రమ్ సంధించిన ప్రశ్నలకి సమాధానంలా ఉంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫిల్మ్ యూనిట్ నుంచి ఇంటెన్స్ పోస్టర్ బయటకి వచ్చింది. గోల్డ్ హార్టెడ్, స్ట్రాంగ్ అండ్ బోల్డ్ ఫైటర్ అంటూ రాజమౌళి విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నాడు. బల్లెం పట్టుకోని పోరాటానికి సిద్దమైన గోండు బెబ్బులిలా ఉన్నాడు. పోస్టర్ అండ్ పోజ్ నార్మల్ గానే ఉన్నా His Eyes Does The Talking. ఈ ఇంటెన్స్ లుక్ చూసిన ప్రతి ఒక్కరు తారక్ కళ్ల గురించే మాట్లాడుతారు. ఎన్టీఆర్ పోస్టర్ వదిలినట్లే చరణ్ బర్త్ డేకి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. ఫైర్ మధ్యలో ఉన్న చరణ్ పోస్టర్ చాలా ఫెరోషియస్ గా ఉంది. రామ్ చరణ్ పోస్టర్ ని ఎన్టీఆర్ పోస్టర్ తో కంపేర్ చేస్తున్నారు. చరణ్ పోస్టర్ లో అతని వెల్ బిల్డ్ బాడీ అండ్ పోజ్ మాట్లాడితే… ఎన్టీఆర్ పోస్టర్ లో తారక్ కళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి. His Intense is Unmatchable Incomparable