రక్తంతో తడిచిన నేల… పోరాటం చాలా పెద్దది

మానవ చరిత్ర సమస్తం యుద్ధ భరితం, కాలానికి అడుగడుగునా రక్త తర్పణం. పోరాటం జరపని మనిషి లేడు, ఎర్రగా మారని అవని లేదు. అందుకే మొదటిలోనే చెప్పను మానవ జాతి చరిత్ర సమస్తం యుద్ధ భరితం అని. మనం చదివిన, విన్న, తెలుసుకున్న, చూసిన, గుర్తున్న విషయాలన్నీ పోరాట గాధలే, పేజీలు తిరగేస్తే వీరుల కథలే. ఇలాంటి ఒక వీరుడి కథతోనే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేయబోతున్నాడు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో కన్ఫార్మ్ అయ్యింది కానీ అఫీషియల్ అప్డేట్ మాత్రం ఈరోజే వచ్చింది.

తారక్ 38వ పుట్టిన రోజు సంధర్భంగా ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ గురించి ట్వీట్ చేస్తూ… రక్తంలో తడిచిన నేల మాత్రం గుర్తుంటుంది అంటూ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ntr31 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఉన్న ఫోటోని రిలీజ్ చేస్తూ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ సలార్, ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్ట్ అయ్యాక సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.